Mahaa Daily Exclusive

  ముగిసిన ముద్రగడ అంత్యక్రియలు…

Share

  • ముగిసిన ముద్రగడ అంత్యక్రియలు
  • పాడె మోసిన వైఎస్ జగన్
  • పోలీసు వందనాన్ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
  • భారీగా తరలి వచ్చిన అభిమానులు
  • కిర్లంపూడిలో ఉద్రిక్తత, గందరగోళం

కాకినాడ, మహా : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాలు ముగిసాయి. ఈ సందర్భంగా కొంత స్పల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అంతకంటే ముందు ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్ పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముద్రగడను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అంతకుముందు ముద్రగడ భౌతికకాయానికి మాజీ సీఎం జగన్‌ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ముద్రగడ సతీమణిని, ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబును కలిసి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పద్మనాభం గడిపిన క్షణాలను, ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేవలం నివాళులర్పించి వెళ్లిపోకుండా, ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాల ప్రక్రియ పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ అక్కడే ఉన్నారు. అనంతరం ప్రారంభమైన ముద్రగడ అంతిమయాత్రలో స్వయంగా పాల్గొన్నారు. అంతిమయాత్ర ముందుకు సాగుతుండగా ముద్రగడ పాడెను తన భుజాలపై మోసి ఆయన పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు.

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలా స్వయంగా పాడె మోయడం అక్కడికి వచ్చిన ప్రజలను, అభిమానులను కదిలించింది. కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం దశాబ్దాలుగా పోరాడిన నేతగా ముద్రగడ పద్మనాభంకు పేరుంది. నిఖార్సయిన వ్యక్తిత్వానికి, రాజీపడని పోరాట పటిమకు ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఇటీవల కాలంలో ఆయన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి నడిచారు. ఆయన మృతితో ఒక బలమైన ప్రజా నాయకుడిని కోల్పోయామని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ అంతిమయాత్రకు పార్టీ శ్రేణులతో పాటు వేలాది మంది అభిమానులు, స్థానికులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం దశాబ్దాలుగా పోరాడిన నేతగా ముద్రగడ పద్మనాభంకు పేరుంది. నిఖార్సయిన వ్యక్తిత్వానికి, రాజీపడని పోరాట పటిమకు ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఇటీవల కాలంలో ఆయన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి నడిచారు. ఆయన మృతితో ఒక బలమైన ప్రజా నాయకుడిని కోల్పోయామని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ అంతిమయాత్రకు పార్టీ శ్రేణులతో పాటు వేలాది మంది అభిమానులు, స్థానికులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.

ఉద్రిక్తత, గందరగోళం

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుదీర్ఘ కాలం పాటు ప్రజాసేవలో ఉన్న ముద్రగడకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ అధికారిక లాంఛనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక నేతలు అడ్డుపడటం అక్కడ తీవ్ర వివాదానికి దారితీసింది. ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వం కల్పించే అధికారిక గౌరవ వందనానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ, అక్కడ ఉన్న వైసీపీ నేతలు మాత్రం దీనికి ససేమిరా ఒప్పుకోమని భీష్మించుకు కూర్చున్నారు. చివరకు అంతిమ సంస్కారాల క్రతువు ముగిసే సమయంలో, నిబంధనల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించడానికి సిద్ధమవగా వైసీపీ శ్రేణులు పోలీసులకు అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. అధికారిక లాంఛనాలు అంటే అది ఏదో టీడీపీ లేదా జనసేన పార్టీలు ఇస్తున్న రాజకీయ గౌరవం కాదని, ఒక మాజీ మంత్రికి ప్రభుత్వం చట్టబద్ధంగా కల్పించే అత్యున్నత గౌరవమని అక్కడ ఉన్న పలువురు నచ్చే చెప్పే ప్రయత్నం చేసిన వినలేదు.

మరోవైపు, కిర్లంపూడిలో బుధవారం ఉదయం నుంచే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ముద్రగడ కుమార్తెను కూడా అడ్డుకున్నారు. భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల సదస్సును ముగించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా కిర్లంపూడి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన జగన్.. ఆయన పార్థివదేహాన్ని కొద్దిదూరం భుజాలపై మోశారు. జగన్ పర్యటన, అంత్యక్రియల ఏర్పాట్ల మధ్య వైసీపీ స్థానిక నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం గందరగోళానికి మరింత ఆజ్యం పోసింది.

సాధారణంగా ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైనా సుదీర్ఘ కాలం పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ప్రజా ప్రతినిధిగా సేవలందించినప్పుడు వారి అంతిమయాత్రను అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో జరపడం అనవాయితీ. కూటమి ప్రభుత్వం ముద్రగడకు ఈ గౌరవాన్ని కల్పించాలని ఆదేశించినప్పటికీ, కేవలం రాజకీయ కక్షసాధింపు కోణంలో వైసీపీ నేతలు ప్రవర్తించడంపై స్థానిక మేధావులు, తటస్థ కాపు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరణంలో కూడా రాజకీయాలు వెతుక్కుంటూ ప్రభుత్వ గౌరవాన్ని అడ్డుకోవడం ముద్రగడ వ్యక్తిత్వానికి భంగం కలిగించడమేనని అసహనం వ్యక్తం చేశారు.

ఈ రాజకీయ వివాదాలు, తోపులాటల మధ్యనే ముద్రగడ పద్మనాభ రెడ్డి అంత్యక్రియలు కిర్లంపూడిలో ముగిశాయి. ఇటు కుటుంబ సభ్యుల వేదన, అటు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది. ప్రభుత్వం కల్పించాలనుకున్న పూర్తి స్థాయి సైనిక వందనం గందరగోళం మధ్య పాక్షికంగానే ముగిసినప్పటికీ. పాలిటిక్స్‌లో తనదైన ముద్ర వేసిన ఒక వివాదాస్పద శకం కిర్లంపూడి మట్టిలో శాశ్వతంగా కలిసిపోయింది.

Latest