- పాలకులలో పెరిగిన అణిచివేత, ఆధిపత్య ధోరణి
- ప్రజల సంపదంత కార్పొరేట్ శక్తుల జేబుల్లోకి
- సమస్యలపై స్పందించే తత్వం లాలయ్య వ్యక్తిత్వం
కారేపల్లి, మహా : ప్రజలను, ప్రశ్నించే వారిని అణిచివేతకు గురిచేస్తూ ఆధిపత్య ధోరణి నీ పాలకుల ప్రదర్శిస్తున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు పి సోమయ్య అన్నారు. శుక్రవారం సీపీఎం సీనియర్ నాయకులు రేపాకుల లాలయ్య 2వ వర్ధంతి సభ శాఖ కార్యదర్శి పోతర్ల నాగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సభలో పీ.సోమయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విధానాల కారణంగా
సంపదంత కొంత మంది కార్పొరేట్ శక్తుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. ప్రభుత్వ రంగాన్ని అప్పనంగా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం, సమాజంలో సగభాగమైన మహిళలపై అత్యాచారాలు, పురుషాధిక్యత, సామాజిక అణిచివేత, ఆధిపత్యం గత 12 ఏండ్లు కా పెరిగిందన్నారు. రైతులు నిత్యం పంట పెట్టుబడి నుంచి మార్కెట్ కు తోలేనంతవరకి దళారుల దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి నిచ్చే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వీబీజీ రాంజీ చట్టంగా మార్చి రాష్ట్రాలపై 40 శాతం భారం వేస్తుందన్నారు. ఉపాధి కల్పన నుండి కేంద్రం తప్పు కొని రాష్ట్రాలపై భారం వేయడంతో కూలీలు పనిచేసినప్పటికీ బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. ఇది ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యంచేసే కుట్ర అని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయకపోవడం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు నిత్యవసర సరుకుల పెరుగుదల కూడా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచి సమీకరించి పోరాడాలని పిలుపునిచ్చారు. రేపాకుల లాలయ్య వర్ధంతిని పురష్కరించుకొని మాణిక్యరం గ్రామం నుండి లాలయ్య స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం పతాకాన్ని పోలేపల్లి సోమయ్య ఎగరవేయగా లాలయ్య స్తూపం, చిత్రపటానికి వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం, మెరుగు సత్యనారాయణ, పూలమాల వేశారు, ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మెరుగు రమణ, మండల కార్యదర్శి కె నరేంద్ర, డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు, కొండబోయిన ఉమావతి, మండల కమిటీ సభ్యులు, వడ్డూరి వీరబాబు, పండగ కొండయ్య, ఎండి ఇస్మాయిల్, రేగళ్ల మంగయ్య, యనమనగండ్ల రవి, కేశగాని ఉపేందర్ తలారి దేవ ప్రకాష్, కరపటి సీతారాములు, పచ్చిపాల యాకేశ్వరరావు, మేకల వీరన్న, వల్లపు లింగయ్య, కరపటి సీతమ్మ, చల్ల మల్లమ్మ, వార్డు సభ్యులు అజ్మీర జ్యోతి, భూక్య విజయ, లాలయ్య సతీమణి రేపాకుల వీరమ్మ , కుత్తూరు నవ్య, లక్ష్మయ్య, రమేష్, వీరభద్రం, గోపాల్, సురేష్,ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.







