- రెండు రాష్ట్రాలు బిజెపి కూటమి వైపే
- మహారాష్ట్రలో 150-195 సీట్లు వస్తాయంటూ సర్వేలు
- జార్ఖండ్ లో హోరాహోరీ.. ఎన్డీఏ కే మొగ్గు
ఢిల్లీ, మహా
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి సంచలన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. బధవారం జరిగిన పోలింగ్ లో ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించగా, భారతీయ జనతాపార్టీ మిత్రపక్షాలు సంచలన విజయాలు నమోదుచేస్తాయన్న అంచనాలు వెలువడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వానికి మహా ప్రజలు ఏకపక్షంగా మద్దతిచ్చారన్న అంచనాలు వెలువడుతున్నాయి. బిజెపి కూటమికి 48శాతం , కాంగ్రెస్ కూటమికి 42శాతం ఓట్ల బదిలీ జరిగిందన్న చర్చ ఉంది. అసలు ఫలితం బయటకు వస్తే గానీ.. లెక్క తేలదు. అన్ని సర్వేలు 150 నుండి 195 వరకు మహాయుతి గెలుస్తుందని స్పష్టం చేశాయి. హర్యానాలో సర్వే అంచనాలు తప్పడంతో.. ఈసారి సర్వే సంస్థలు మరింత జాగ్రత్త తీసుకున్నాయి. అయితే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఎగ్జిట్ పోల్స్ పై బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాయుతి 200మార్కును దాటుతుందని ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్ కూటమికి 80 నుండి 110 వరకు రావొచ్చన్న అంచనాలు చెబుతున్నారు.
అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే
పోలింగ్ ముగిసిన వెంటనే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కొన్ని రోజుల క్రితం హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన ఫలితాలకు.. ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఫలితాలకు పొంతన లేకపోవడంతో తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతాయి అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ 145. ఇక జార్ఖండ్‌లో 81 సీట్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ 41.
మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్
పీపుల్స్ పల్స్
మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–175-195 సీట్లు
మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)–85-112 సీట్లు
ఇతరులు–7-12
కేకే సర్వే
మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)-225 సీట్లు
మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)- 56
టైమ్స్ ఆఫ్ ఇండియా :**ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీకి 150-170 స్థానాల్లో విజయం సాధించే ఛాన్సు ఉన్నట్లుగా తెలిపింది. ఇక రెండో స్థానంలో ఎంవీఏ-110-130 స్థానాల్లో గెలిచే ఛాన్సుంది.ఇతరులు 8-10 స్థానాల్లో పాజిటివ్ ఫలితాలు వస్తాయని పేర్కొంది.
రిపబ్లిక్ పీమార్క్: ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ 137-157, కాంగ్రెస్-126-146, ఇతరులు-8 స్థానాల్లో గెలిచే ఛాన్సుందని పేర్కొంది.
మహారాష్ట్ర ఏబీపీ: బీజేపీ-150-170, కాంగ్రెస్-110-130,ఇతరులు-8-10
మ్యాట్రైజ్ మహారాష్ట్ర- 150-170, కాంగ్రెస్-110-130,ఇతరులు-8-10
లోక్‌శాహీ మరాఠీ
మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–128-142 సీట్లు
మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)– 125-140 సీట్లు
ఇతరులు –18-23 సీట్లు
జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్
……………………………………
పీపుల్స్ పల్స్
బీజేపీ కూటమి–44-53 సీట్లు
ఇండియా కూటమి–25-37 సీట్లు
ఇతరులు–5-9 సీట్లు
మ్యాట్రిజ్
బీజేపీ–42-47 సీట్లు
ఇండియా కూటమి–25-30 సీట్లు
ఇతరులు–1-4 సీట్లు
టైమ్స్ నౌ-జేవీసీ
బీజేపీ–40-44 సీట్లు
ఇండియా కూటమి–20-40 సీట్లు
ఇతరులు–1 సీటు








