Mahaa Daily Exclusive

  ఆదర్శాల ముసుగులో దేశద్రోహం….

Share

ఆదర్శాల ముసుగులో దేశద్రోహం.
* చైనా తర్వాత ఇప్పుడు దాయాది పాకిస్థాన్‌తో వాంగ్‌చుక్ చీకటి దోస్తీ.
* పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో రహస్య మంతనాలు.
* బట్టబయలైన లడఖ్ ఆక్టోపస్ బాగోతం.
* గ్లోబల్ ఫండింగ్ కోసమే ఇస్లామాబాద్, బంగ్లాదేశ్ పర్యటనలు.
* పర్యావరణం పేరుతో 200 కనాల్స్ ప్రభుత్వ భూమి కబ్జా.

(గడల నరసింహారావు సీనియర్ జర్నలిస్ట్)

పర్యావరణ పరిరక్షకుడు, ఆదర్శ విద్యావేత్త, అహింసావాది… ఇవన్నీ బాహ్య ప్రపంచానికి సోనమ్ వాంగ్‌చుక్ వేసుకున్న రంగుల ముసుగులు మాత్రమే! ఆ ముసుగు వెనుక దాగి ఉన్న ఒక భయంకరమైన కుట్రకోరు, దేశద్రోహి, బారీ అవినీతిపరుడి అసలు స్వరూపం తాజాగా పక్కా సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైంది. ఒకవైపు చైనా విద్రోహ శక్తులతో చీకటి ఒప్పందాలు నెరుపుతూనే.. ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్, అలాగే బంగ్లాదేశ్ శక్తులతో ఆయన సాగిస్తున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలు భద్రతా వ్యవస్థలనే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పర్యావరణం పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతూ ఆమరణ దీక్షల డ్రామాలు ఆడుతున్న ఈ “ఆదర్శ మూర్తి” వెనుక ఇస్లామాబాద్ కుట్ర దాగి ఉందని దర్యాప్తులో తేలింది.
లడఖ్ డీజీపీ (DGP) ఎస్.డి. సింగ్ జమ్వాల్ స్వయంగా రంగంలోకి దిగి చేసిన లోతైన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వాంగ్‌చుక్‌కు పాకిస్తాన్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, ఆయన పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలను సందర్శించడం ముమ్మాటికీ దేశ వ్యతిరేక చర్యేనని పోలీసుల విచారణలో కుండబద్దలు కొట్టారు. వాతావరణ మార్పులు, హిమానీనదాల (Glaciers) కరుగుదల గురించి చర్చించడానికి ఫిబ్రవరి 2025లో ఇస్లామాబాద్‌లో జరిగిన ‘బ్రీత్ పాకిస్తాన్ 2025’ (Breathe Pakistan 2025) సదస్సుకు కేవలం వృత్తిపరంగానే వెళ్లానని ఆయన భార్య గీతాంజలి అంగ్మో కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అదంతా వట్టి బూటకమని తేలిపోయింది. పాకిస్తాన్‌లో ‘ది డాన్’ (The Dawn) పత్రిక నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడం వెనుక సరిహద్దులు దాటిన కుట్ర దాగి ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇదంతా కేవలం విదేశీ నిధుల (Global Funding) కోసం ఆడుతున్న నాటకమని బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా వాంగ్‌చుక్ బండారాన్ని బయటపెట్టారు. దీన్ని బలపరుస్తూ ఇటీవల అరెస్టయిన ఒక పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఇచ్చిన వాంగ్మూలం దేశ భద్రతను కుదిపేస్తోంది. సదరు పాక్ ఏజెంట్ నేరుగా వాంగ్‌చుక్‌తో టచ్‌లో ఉన్నాడని, లడఖ్ నిరసనలకు సంబంధించిన సున్నితమైన వీడియోలను సరిహద్దు అవతలికి పంపించాడని తేలడం ఈ వ్యవహారంలో అత్యంత సంచలనాత్మకమైన, భయంకరమైన నిజం!
విద్యాభివృద్ధి పేరుతో ‘స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్’ (SECMOL – సెక్మోల్) సంస్థను స్థాపించిన ఈయన చేసిన మరో మహా పాపం.. ఏకంగా 200 కనాల్స్ ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకోవడం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నయా పైసా పన్నులు, బకాయిలు చెల్లించకుండా, తన పరపతిని ఉపయోగించి కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తన సొంత జాగీరులా మార్చుకున్న ఈ భూబకాసురుడి అక్రమాలకు అంతులేదు. దీనికి తోడు, సేవ ముసుగులో విదేశాల నుంచి వస్తున్న కోట్లాది రూపాయల నిధులను ఫారిన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ (FCRA) నిబంధనలను పాతరేసి దారి మళ్లించాడు. విదేశీ ఎన్జీఓల అకౌంట్ల ద్వారా కోట్లాది రూపాయలు ఎలా చేతులు మారుతున్నాయో, ఆ నిధులు దేశ వ్యతిరేక ఆందోళనలకు ఎలా ఖర్చవుతున్నాయో ఈ బారీ ఫండింగ్ వ్యవహారమే స్పష్టం చేస్తోంది.
తన బారీ కుంభకోణాలను, చైనా-పాక్ లింకులను కప్పిపుచ్చుకునే క్రమంలో అడ్డువచ్చే ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం వాంగ్‌చుక్ ప్రధాన ఆయుధం. జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ను, జోనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను దారుణమైన అసభ్య పదజాలంతో దూషిస్తూ, అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, తన మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పదేపదే బెదిరింపులకు పాల్పడిన పక్కా బ్లాక్ మెయిలర్ ఈయన. ఇప్పుడు విదేశీ నిధుల రాక ఆగిపోయి, పాక్ ఏజెంట్లతో తన కుమ్మక్కు బట్టబయలై చట్టం ఉచ్చు బిగిస్తుండటంతో.. ప్రజల దృష్టి మళ్లించడానికి, జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్న భయంతోనే ఢిల్లీ వేదికగా ఈ ఆమరణ దీక్షల మహా డ్రామాకు తెరతీశాడని దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తున్నాయి. ఇదీ లడఖ్ ఆక్టోపస్ కాదనలేని నగ్న సత్యం!