వరంగల్, కార్పొరేషన్ మహా ;
వరంగల్ నగరంలోని కరీంబాద్ ప్రధాన తాగునీటి పైప్‌లైన్ లో ఏర్పడిన లీకేజీకి మరమ్మతులు చేపట్టేందుకు దేశాయిపేట ఫిల్టర్ బెడ్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ బాబు తెలిపారు.
దీని కారణంగా గురువారం దేశాయిపేట ఫిల్టర్ పరిధిలోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా పాక్షికంగా ప్రభావిత మవుతుందని పేర్కొన్నారు.
మరమ్మతు పనులను అత్యవసరంగా చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసి సాధారణ తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
దేశాయిపేట ఫిల్టర్ పరిధి ప్రాంతాల్లోని ప్రజలు ఈ తాత్కాలిక అసౌకర్యాన్ని గమనించి జీడబ్ల్యూఎంసీకి సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్‌బాబు విజ్ఞప్తి చేశారు.
Post Views: 8








