- చీమలపాడు ప్రాంతంలో రాములు నాయక్ విస్తృత పర్యటన
- పలకరింపులు పరామర్శలతో కొనసాగిన రాములు నాయక్ పర్యటన
కారేపల్లి, మహా:మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ బుధవారం పర్యటించారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ ఆర్.ఎం.పి పోతురాజు రమేష్ తండ్రి పోతురాజు కృష్ణయ్య దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అంతకు ముందు చీమలపాడు గ్రామానికి చెందిన పాటి కోటయ్య అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మరణించిన
బసవ రాంబాబు చిత్ర పటానికి నివాళులుర్పించి వారి కుటుంబ సభ్యులును ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట వైరా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, సొసైటీ వైస్ చైర్మన్, సర్పంచ్ ధారావత్ మంగీలాల్, మాజీ ఎంపీటీసీ ధరంసొత్ శంకర్, మాజీ సర్పంచ్ లు మాలోత్ కిషోర్, బానోత్ శంకర్, మౌనిక, రాంజీ, మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మిర వీరన్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాంకుడోత్ నరేష్, నాయకులు పాటి శ్రీను, అజ్మిర భిక్కు లాల్, బానోత్ ప్రసాద్,
వీరబాబు, దారావత్ ఫూల్సింగ్, ఇస్లావత్ రాజాకుమార్, శీలంశెట్టి రాంబాబు, వెంకన్న, పాటి రమేష్, గుగులోతు హారు,
భూక్య రాంకిషోర్, తదితరులున్నారు.








