- కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం
- బాకీ తీర్చాలని కోరితే బంగారం పూత పూసిన కంకర రాళ్లు ఇచ్చిన వైనం
- నిజామాబాద్ పట్టణంలో ఘటన
నిజామాబాద్, మహా : బాకీ తీర్చాలని కోరితే కంకర రాళ్లకు బంగారం పూత పూసి ఇచ్చిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడీకి చెందిన రమేష్ వద్ద శఅరీనిలాస్ అనే వ్యక్తి రూ.1.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని శ్రీనివాస్ పై రమేష్ ఒత్తిడి తెచ్చాడు. దాంతో తనకు గుప్తనిధులు దొరికాయని, అందులో బంగారం రాళ్లు ఉన్నాయని చెప్పిన శ్రీనివాస్ బంగారు రాళ్లను అప్పు కింద కట్టుకోమని రమేష్ ను నమ్మించాడు. నిజామాబాద్‌లో కాకుండా డిచ్‌పల్లి మండలం ఘన్ పూర్ కి అదనంగా రూ. 32 వేలు తీసుకొని రావాలని రమేష్ కు శ్రీనివాస్ సూచించాడు. నాలుగు కుండల్లో నాలుగు బంగారం రాళ్లను రమేష్ కు శ్రీనివాస్ అందించాడు. అనుమానం వచ్చి చూడగా.. కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసినట్లు బాధితుడు రమేష్ గుర్తించి, మోసపోయానని గ్రహించి డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Post Views: 4







