- రేషన్ షాపులను తనిఖీ చేసిన సీవిల్ సప్లై అధికారి
- సీతారాంపురం రేషన్ షాపు సీజ్
కారేపల్లి, మహ : కారేపల్లి మండలం లో రేషన్ షాపులను ఖమ్మం రూరల్ సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ విజయబాబు శుక్రవారం తనిఖీ చేశారు. సీతారాంపురం గ్రామం లో గల రేషన్ షాపును తనిఖీ చేయగా 128 క్వింటాల 37 కేజీలు వ్యత్యాసం రావడంతో రేషన్ డీలర్ ఈసం కృష్ణ పై 6 ఏ కేసు నమోదు చేసి రేషన్ షాప్ ను సీజ్ చేశారు. దీని నిర్వహణను సమీప డీలర్ ఎట్టె నాగేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించినారు. ఈ తనిఖీలో సివిల్ సప్లై రెవిన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్య పాల్గొన్నారు.
Post Views: 47







