- మన గోల్ట్ డబ్బు కాజేసిన ఇద్దరి అరెస్టు
- నిందితుల నుండి కారు, సేల్ పోన్ స్వాధీనం
- విలేకరుల సమావేశంలో సీఐ సాగర్ వెల్లడి
కారేపల్లి, మహ : పాత బంగారం కొనుగోలు, బ్యాంకు పైనాన్స్ సంస్ధల నుండి బంగారి విడిపించి వాటిని కొనుగోలు చేసే సంస్ధ ప్రతినిధి నుండి డబ్బులు కాజేసిన ఇద్దరి వ్యక్తులను కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించి సింగరేణి సీఐ ఎన్.సాగర్ కారేపల్లి లోవిలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కారేపల్లికి చెందిన ముందాడ రాంచందర్ సుమారు 30 మందిని ఏజెంట్లను పెట్టుకోని రాగి వస్తువులపై బంగారం పూత పూసి వాటిని అమాయకులతో బ్యాంకులు, ఫైనాన్స్, ప్రయివేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. ముందాడ రాంచందర్ తన అనుచరుడైన భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోత్ సునిల్ కుమార్ ద్వారా ఇల్లందు ముత్తూట్ ఫైనాన్స్ సంస్ధలో 52 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టించి రూ.3.90 లక్షలు తీసుకున్నాడు. ఫైనాన్స్ సంస్ధ అడిట్ తనిఖీలో సునిల్ కుమార్ పెట్టిన బంగారం నకిలీది తేలింది. దీంతో ఆ సంస్ధ ప్రతినిధులు సునిల్ కుమార్ ను కలిసి వెంటనే పైకం చెల్లించాలని,లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ముత్తూట్ లోని బంగారం విడిపించటానికి హైదరాబాద్ లోని మన గోల్డ్ సంస్ధను అశ్రయించారు. మన గోల్డ్ సంస్ధ వారు బంగారం విడిపించి కొనుగోలు చేయటానికి అంగీకరించారు. దీంతో మన గోల్డ్ ప్రతినిధి హైదరాబాద్ నుండి ఇల్లందుకు వస్తుండగా అతనిని రులో తీసుకవస్తూ కారేపల్లి మండలం బస్వాపురం వద్దకు రాగానే గుగులోత్ సునిల్ కుమార్, తన పాటు తీసుకవచ్చిన దారావత్ రాకేష్ అనే వ్యక్తితో కలిసి మన గోల్డ్ ప్రతినిధిని అటకాయించి అతని వద్ద ఉన్న రూ.5.80 లక్షలనుకాజేసి పరారైనారు. ఈ విషయాన్ని మన గోల్డ్ ప్రతినిధి కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఎన్.సాగర్ పర్యవేక్షణలో కారేపల్లి ఎస్సై బైరు గోపి ఆధ్వర్యంలో పోలీసులు వల పన్ని ముఠా కు నేతృత్వం వహిస్తున్న ముందాడ రామచందర్ సభ్యుడు గుగులోతు సునిల్ కుమార్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ సాగర్ తెలిపారు. మరో నిందితుడు ధారావత్ రాకేష్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. రాగి వస్తువులపై బంగారు పూతతో నిజమైన బంగారం చలామణి లో ప్రమేయం ఉన్న వ్యక్తులపై దర్యాప్తు సాగిస్తున్నట్లు సీఐ సాగర్ తెలిపారు. నిందితుల వద్ద నుండి వెర్నా కారు, ఐక్యూ మొబైల్ ఫోన్, నగదు రూ.10 వేలు స్వాధీనం చేసుకోని నిందుతులు మందాడ రాంచందర్, గుగులోత్ సురేష్ లను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో కారేపల్లి ఎస్సై బైరు గోపి, కామేపల్లి ఎస్సై పీ.శ్రీకాంత్, పోలీసు సిబ్బంది ఉన్నారు.







