Mahaa Daily Exclusive

  రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి … మరో యువకుడికి తీవ్ర గాయాలు…

Share

 

కారేపల్లి, మహ,:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం కారేపల్లి మండలం ఎర్రబోడు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎర్రబోడు కోయగుంపుకు చెందిన వజ్జా సునీల్ (36), పాయం సాయి మోటార్ సైకిల్ పై ముత్యాలగూడెం నుండి ఎర్రబోడు మీదుగా కోయగుంపుకు వెళ్తున్నారు. ఎర్రబోడు సమీపంలోని మూలమలుపు వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి కింద పడడంతో సునీల్ తలకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే మృతి చెందాడు. పాయం సాయికి తీవ్ర గాయాలు కావడంతో అతనిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిషన్ గా విద్యుత్ శాఖ సిబ్బందికి సహాయకారిగా పని చేస్తుంటాడు.