Mahaa Daily Exclusive

  గ్రామీణ పేదలకు ఉపాధీ దూరంచేస్తున్న కేంద్రం…

Share

  • గ్రామీణ పేదలకు ఉపాధీ దూరంచేస్తున్న కేంద్రం
  • జైలు భరోతో పేదల సత్తా చూపాలి – వ్యకాస నేత కొండబోయిన నాగేశ్వరరావు

కారేపల్లి, మహ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపాధిని దూరం చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంజిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. కార్మిక, కర్షక, రైతు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదిన నిర్వహిస్తున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం కారేపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకువస్తోందన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా కొత్త బిల్లులను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలను దూరం చేస్తోందని తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులకు రక్షణ కల్పిస్తున్న కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్‌లుగా తీసుకువచ్చి కార్మిక హక్కులను హరించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పేదల సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కే.నరేంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కేసగాని ఉపేందర్, ఎనమనగండ్ల రవి, ముండ్ల ఏకాంబరం పాసిని నాగేశ్వరరావు, నాగమణి, కమల, రాధ, హుస్సేన్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.