Mahaa Daily Exclusive

  కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత..! బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పి కాళీ ప్రసాద్ రావు..!

Share

పరకాల మహా ;

పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన ఆదరసాని బాపూరావు, ఆత్మకూర్ లక్ష్మీబాయి, పూజారి లక్ష్మయ్య, కొనగాని కనకయ్యలు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉపగాళ్ల శ్రీకాంత్ రెడ్డి, చౌలపల్లి గ్రామ సర్పంచ్ మోరే రాజేశ్వరరావు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు బలవంతుల రాజు, ఆర్టీఐ జిల్లా కన్వీనర్ ఎద్దులపురం శ్రవణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ టింగిలికారి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి రవ్వ శివప్రసాద్, మండల ఉపాధ్యక్షులు పూజారి రవీందర్, పీసాల సాంబయ్య, కోశాధికారి జక్కుల మహేందర్, బూత్ అధ్యక్షులు యాద కుమార్, తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest