Mahaa Daily Exclusive

  ఇంచార్జీ పాలనలో వరంగల్ DMHO..? ఒకే అధికారికి రెండు కీలక బాధ్యతలు..! వరంగల్ జిల్లాకు పూర్తి స్థాయి DMHO నియామకం ఎప్పుడూ.m?

Share

  • ఇంచార్జీ పాలనలో వరంగల్ DMHO?
  • ఒకే అధికారికి రెండు కీలక బాధ్యతలు..
  • జిడబ్ల్యూ ఎం సి CMHO తో పాటు వరంగల్ DMHO గా ఇంచార్జీ గా అదనపు బాధ్యతలు..!
  • వరంగల్ జిల్లాకు పూర్తి స్థాయి DMHO నియామకం ఎప్పుడూ?

వరంగల్, మహా ;

వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు పూర్తి స్థాయి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) లేకపోవడంతో ఇంచార్జీ పాలన కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు CMHO గా పనిచేస్తున్న డాక్టర్ రాజారెడ్డి కి ఇటీవల వరంగల్ DMHOగా ఇంచార్జీ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ప్రజారోగ్య కార్యక్రమాల అమలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణ, వైద్య సిబ్బంది పరిపాలన, ప్రైవేట్ వైద్య సంస్థల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు ఉంటాయి. ఇలాంటి కీలక శాఖకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో పరిపాలన పై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

*ప్రభుత్వ వెబ్‌సైట్ల లో అధికారుల వివరాల పై గందరగోళం?*

మరోవైపు, వరంగల్ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రోజు వరకు కూడా డాక్టర్ బి. సాంబశివరావు ను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిగా పేర్కొంటోంది.

వరంగల్ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఆయనను DM&HO, Warangal రూరల్ గా చూపిస్తోంది.

ప్రస్తుతం డాక్టర్ రాజారెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో..

ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రం పాత అధికారి వివరాలు కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

అధికారుల బదిలీలు, బాధ్యతల మార్పుల అనంతరం ప్రభుత్వ వెబ్‌సైట్లలో వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

*వరంగల్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలి!!*

వరంగల్ జిల్లాకు పూర్తి స్థాయి DMHOను నియమించడంతో పాటు, ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో అధికారుల వివరాలను తాజా సమాచారంతో అప్‌డేట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిపాలన పై వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, పూర్తిస్థాయి అధికారి నియామకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పూర్తిస్థాయి DMHO నియామకం పై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

*అక్కడ నేనే.. ఇక్కడ నేనే..!*

ఒకే అధికారికి రెండు కీలక బాధ్యతలు..

*అసలు ఏం జరుగుతోంది?*

పంద్రాగస్టు వేళ క్రింది స్థాయి ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ఇవ్వకున్నా పర్వాలేదు..

కానీ జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారుల వివరాలు, బాధ్యతలు చూడాల్సిన అవసరం జిల్లా అధికారుల పై ఉంటుంది అనేది వాస్తవం…

కాగా వరంగల్ డిఎంహెచ్వో గా అదనపు బాధ్యతలు చేపట్టిన రాజారెడ్డికి త్వరలోనే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.!

Latest