Mahaa Daily Exclusive

  దాడి చేసిన నిందితుల్లో ఒకరు అరెస్ట్ జైలుకు తరలింపు..! కేసులో మిగతా ఆరుగురి కోసం పోలీసుల గాలింపు..

Share

వరంగల్, గీసుగొండ మహా ;

వరంగల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 7 6 2026 న ఇంటి స్థలం విషయంలో జరిగిన వివాదంలో ఫిర్యాదుదారుడు దౌడు ప్రవీణ్ , అతని అన్న అలాగే తండ్రి పై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించి, గాయపరిచిన ఘటన పై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులు ఉన్నారు.
దౌడు అనిల్,
దౌడు పోశాలు,
దౌడు సువర్ణ,
దౌడు సుజాత,
చిన్నగారి నరేష్,
చిన్నగారి లక్ష్మి ,
దౌడు రుషీల్ పాల్ అను వారు ఇంటి స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి ఫిర్యాదుదారుడు, అతని అన్న దౌడు ప్రమోద్ తో పాటు తండ్రి దౌడు మొగిలి ని దూషిస్తూ చేతులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో దౌడు ప్రమోద్‌ కు ముక్కు, మెడ తదితర ప్రాంతాల్లో గాయాలు కాగా, ఫిర్యాదుదారుడి ఎడమ చేతి చూపుడు వేలుకు గాయం అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో నిందితుడు దౌడు అనిల్, తండ్రి పోషయ్య, వయస్సు 45 సంవత్సరాలు, గీసుగొండ గ్రామంను* పోలీసులు అరెస్ట్ చేసి, గురువారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు తరలించడం జరిగింది.
కేసులో మిగిలిన 6 మంది నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను చట్టపరంగా అరెస్ట్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని గీసుగొండ సీఐ
డి. విశ్వేశ్వర్ తెలిపారు.

Latest