Mahaa Daily Exclusive

  ఇందిర లుక్‌లో ప్రియాంక గాంధీ..

Share

  • కేరళ సంప్రదాయ.. క్రీమ్ కలర్ చీరను ధరించి..
  • రాజ్యాంగం పట్టుకుని గాలిలో ఊపుతూ హిందీలో ప్రమాణం
  • ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీలకు అభివాదం

 

ఢిల్లీ, మహా

ఇందిరమ్మను గుర్తు తెచ్చేలా ప్రియాంకగాంధీ తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టినపుడు ప్రత్యేకంగా కనిపించారు. కేరళ కాటన్ జారీ చీర ధరించి కట్టుబొట్టుతో అక్కడి సంస్కృతి ప్రతిభించేలా ప్రియాంక లోక్‌సభకు హాజరయ్యారు. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ప్రియాంక గాంధీ వాద్రా గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక కుటుంబం అంతా కూడా పార్లమెంటు హౌజ్‌లోనే ఉన్నారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్‌ గాంధీతో పాటు భర్త రాబర్ట్ వాద్రా, ఆమె కుమారుడు రెహాన్ వాద్రా, కుమార్తె మిరాయా వాద్రా కూడా పార్లమెంట్ హౌస్‌లో ఉన్నారు.

 

కేరళ సాంప్రదాయాన్ని అనుసరించి క్రీమ్ కలర్ చీర కట్టుకున్న ప్రియాంక గాంధీ పార్లమెంటు హౌస్‌కి చేరుకున్నారు. ప్రియాంక కేరళ కాటన్ జారీ చీర ధరించి కట్టుబొట్టుతో అక్కడి సంస్కృతి ప్రతిభించేలా లోక్‌సభకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా, ప్రియాంక తన చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, దానిని గాలిలో చూపుతూ.. హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రియాంక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ముకుళిత హస్తాలతో అభివాదం చేశారు. అనంతరం మొదటి వరుసలో కూర్చున్న ప్రతిపక్ష నేతలకు ప్రియాంక అభివాదం చేశారు. సభలో ప్రతిపక్ష నేత, ఆయన సోదరుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రియాంక ప్రతిపక్ష ఎంపీలకు ఉన్న నాలుగో వరుస సీట్లలో కూర్చున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి వరుసలో కూర్చున్నారు. ప్రియాంక లోక్‌సభలోకి అడుగుపెట్టగానే కాంగ్రెస్ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను చుట్టుముట్టి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. కాగా, మిసా భారతి, దీపేందర్ హుడా, శశిథరూర్ సహా పలువురు ఎంపీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీలకు అభివాదం చేసిన ప్రియాంక, గ్యాలరీలో కూర్చున్న సోనియా గాంధీని, ఆమె అత్తగారిని కూడా పలకరించారు. ప్రియాంకతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నేత రవీంద్ర బసంత్రావ్ చవాన్ కూడా ఈరోజు పార్లమెంటు సభ్యులుగా ప్రమాణం చేశారు. చవాన్ మరాఠీ భాషలో ప్రమాణం చేశారు.

Latest