Mahaa Daily Exclusive

  ఏపీ సచివాలయ ఉద్యోగుల నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ …!

Share

 

ఏపీ సచివాలయ ఉద్యోగులు కొందరు వివాదంలో చిక్కుకుకున్నారు. అనుమతులు లేకుండా మద్యం పార్టీ చేసుకున్న పలువురు ఉద్యోగుల పై ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ సచివాలయ డైరెక్టర్ పోస్ట్ జరగ బోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పార్టీ జరిగినట్టు సమాచారం, ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి ని పోలీసులు అదుపులో కి తీసుకున్నట్టు సమాచారం,

సచివాలయం క్యాంటీన్‌లో మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 28 మంది పోటీలో నిలిచారు. వీరిలో 11 మంది వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన వారు. తన వర్గానికి చెందిన అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో సచివాలయ ఉద్యోగులకు మందు, విందు పార్టీతో ప్రలోభ పెట్టినట్లు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఇదిలాఉంటే, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయనపై వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేవారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆయన సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు. ఇదిలాఉంటే, వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం ఇటీవల సమగ్ర విచారణకు ఆదేశించింది. ఏపీఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించడంతో పాటు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసి సర్వీస్ రూల్స్ అతిక్రమించారనే ఫిర్యాదులపై విచారించి నివేదిక అందజేయాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.