Mahaa Daily Exclusive

  టిడిపి కార్యకర్తకు చింతలపూడి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం….!

Share

కష్టాల్లో ఉన్న కార్యకర్తకు ఆర్థిక సహాయం చేసి వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వచ్చి నెల రోజుల్లోనే జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టిడిపి కార్యకర్త సయ్యద్ అన్వర్ కు. 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మంచి మనసును సాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.
నెలరోజుల కిందట జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో క్లస్టర్ సమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు కార్యకర్తల కష్టాలను అడిగి తెలుసుకున్నారు అదే సమయంలో పట్టణానికి చెందిన సయ్యద్ అన్వర్ తన కష్టాన్ని శాసనసభ్యులు ముందు వివరిస్తూ సార్ నా పేరు సయ్యద్ అన్వర్.నేను ఆటో ఆట తోలుకుంటూ జీవనం గడుపుకునేవాడిని సార్. ఎలక్షన్ సమయం లో పార్టీ కోసం రెండు నెలలపాటు కష్టపడి పని చేశాను సార్.. రెండు నెలలు ఖాళీగా ఉండటం వలన కుటుంబం గడవడం కూడా కష్టంగా మారింది సార్..నాకు కొంత ఆర్థిక సహాయం చేస్తే సొంతంగా ఆటో కొనుక్కుంటాను సార్…(అని) (కార్యకర్త ఎమ్మెల్యేకు వివరించగానే) ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను నీకు అండగా ఉంటా..ఒక నెల రోజుల్లో 50 వేల రూపాయలు నేను నీకు సహాయం చేస్తాను అని. మాట ఇచ్చారు..ఇచ్చిన మాట ప్రకారం చింతలపూడి శాసనసభ్యులు జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు..సయ్యద్ అన్వర్ కు 50 వేల రూపాయ చెక్కును అందజేసి గొప్ప మనసును చాటుకున్నారు..ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు…