Mahaa Daily Exclusive

  ఎమ్మెల్సీపై ఎంఐఎం వేటు.. వెంటనే రాజీనామాకు ఆదేశం..!

Share

ఎమ్మెల్సీపై ఎంఐఎం వేటు.. వెంటనే రాజీనామాకు ఆదేశం!
వివాదంలో చిక్కుకున్న తెలంగాణ ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, మండలి ఛైర్మన్‌కు లేఖ పంపాలని ఆదేశించింది.

2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్‌ బేగ్‌ పదవీకాలం 2029 మే వరకు ఉన్నప్పటికీ.. పార్టీ నిర్ణయంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ మీర్జా రహ్మత్ బేగ్ పట్టుబడ్డారంటూ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు.

అత్తాపూర్‌లో కొందరు యువకులు ఆయనను పట్టుకుని కొట్టి, వీడియోలు తీశారన్నారు.

ఈ విషయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసని, అయినా రహ్మత్ బేగ్‌ను ఉమ్రాకు పంపించారని సబ్దర్ అలీ ఆరోపించారు.

వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు.

Latest