జనరల్‌గా వరి విత్తనాలు కావాలంటే ఏం చెయ్యాలి.. విత్తనాలు అమ్మే షాపులకు వెళ్లాల్సి ఉంటుంది. తీరా వెళ్లాక.. ఆ విత్తనాలు అక్కడ లేకపోతే, చాలా చోట్ల తిరగాల్సి ఉంటుంది. ఇవన్నీ రైతులకు ఎంతో ఇబ్బంది కలిగించే అంశాలు. అందుకే తెలంగాణ ప్రభుత్వం మరో మంచి పని ప్రారంభించింది. రైతులు ఎక్కడికీ వెళ్లే పని లేకుండా.. విత్తనాలను వారి ఇంటికే వచ్చేలా చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ.. ఓ కార్యక్రమం ప్రారంభించింది.
రబీ ) సీజన్‌లో 50వేల క్వింటాళ్ల వరి విత్తనాలను సరఫరా చెయ్యాలని విత్తన అభివృద్ధి సంస్థ డిసైడ్ అయ్యింది. ఈ విత్త నాలు 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట వెయ్యడానికి సరిపోతాయి. ఈ విత్తనాల కోసం రైతులు కాల్ చేస్తే.. ఇవి ఇంటికి రావడమే కాదు.. ఎలాంటి రవాణా ఛార్జీలు కూడా ఉండవు. అలాగే 25 కేజీల బస్తా ధరను రూ.995గా ఫిక్స్ చేసింది. తక్కువ ధర పెట్టడమే కాకుండా.. అత్యంత నాణ్యమైన విత్తనాలను ఇస్తోంది.








