Mahaa Daily Exclusive

  సర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

Share

వరంగల్, బ్యూరో మహా;

సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ మంగళవారం కాశీబుగ్గ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం, వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు హియరింగ్ ప్రక్రియను పరిశీలించారు.
వరంగల్ ఆర్డీవో తో కలిసి ఆయా కార్యాలయాలను సందర్శించిన కలెక్టర్, సమగ్ర ఓటరు సవరణ కి సంబంధించిన దరఖాస్తులు, అభ్యంతరాలపై నిర్వహిస్తున్న హియరింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ హియరింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి అంశాన్ని నిబంధనలకు అనుగుణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో, సంబంధిత తహసీల్దార్లు, ఎన్నికల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest