Mahaa Daily Exclusive

  నటుడు ప్రకాష్ రాజ్ అరెస్ట్….

Share

నటుడు ప్రకాష్ రాజ్ అరెస్ట్.
* ఓటర్‌ ఐడీ వివాదం.. ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక ఆందోళన.

బెంగళూరు, మహా.

నటుడు ప్రకాశ్‌రాజ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. బహుళ ఓటరు గుర్తింపు కార్డుల ఆరోపణలతో న్యాయపరమైన కేసును ఎదుర్కొంటున్న ఆయన.. తాజాగా కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొనగా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబరు 1న ఫ్రీడమ్‌ పార్క్‌లో జరిగిన ‘ఎన్నికల సంఘం కార్యాలయానికి తరలింపు’ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్‌తో పాటు నటుడు కిశోర్‌, పలువురు పౌరసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్రీడమ్‌ పార్క్‌ నుంచి కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటకలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ నిరసన నిర్వహించారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లు తొలగించే అవకాశం ఉందని ఆందోళనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ కూడా ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడతామని పేర్కొన్నారు.

Latest