Mahaa Daily Exclusive

  విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలి..:వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

Share

  • గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

వరంగల్, నర్సంపేట మహా ;

నర్సంపేట మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ సందర్శించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి కళాశాలలో పర్యటించి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన తీరును అలాగే
తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ రికార్డులను పరిశీలించారు.
ఉపాధ్యాయులు బోధిస్తున్న అంశాలపై విద్యార్థినులను ప్రశ్నించి వారి అభ్యాసన సామర్థ్యాన్ని వారి మాటల్లోతెలుసుకున్నారు.
విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రతి విద్యార్థిని చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

కళాశాలలో విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా బోధన తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.

విద్యార్థినుల భవిష్యత్తుకు పటిష్టమైన పునాది పడేలా నాణ్యమైన విద్యాబోధన అందించాలని సూచించారు.

వంట సామాగ్రి నిలువ గదిని పరిశీలించి నాణ్యమైన పప్పు దినుసులు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు.

ప్రభుత్వం అందిస్తున్న మెను ప్రకారంగా పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాల్సిందిగా సంబధిత వార్డెన్ ను ఆదేశించారు.

తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేయడమైనది.
పిల్లల ఆరోగ్య సంరక్షణ విషయంలో
ఎఎన్ఎమ్ వద్ద ఉన్న మెడిసిన్ ను పరిశీలించి అందుబాటులో నాణ్యమైన మెడిసిన్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

ఈ పర్యటనలో డిటిడివో నారాయణ రెడ్డి, డిబిసిడివో పుష్పలత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Latest