- హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
- వివిధ కార్యక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఈవో గిరిరాజ్ గౌడ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష*
హనుమకొండ, మహా ;
నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2024 ర్యాంకు కంటే ఈ విద్యా సంవత్సరంలో ఉత్తమ విద్యా ప్రమాణాలను పాటిస్తూ విద్యా రంగంలో జిల్లాకు పరాక్ రాష్ట్రీయ సర్వేక్షన్ (పీఆర్ఎస్) -2027 లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని 108 ఎఫ్ ఎల్ ఎన్ కాంపిటెంట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై ప జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, డీఈవో గిరిరాజ్ గౌడ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్, డ్రాప్ బాక్స్ ఏర్పాటు, ఎఫ్ ఎల్ ఎన్, తనిఖీ బృందాల పనితీరు, ఖాన్ అకాడమీ, ఏఎక్సెల్ పాఠశాలల పురోగతి, విద్యార్థులకు ఉపయోగపడే అపార్ నమోదు, తదితర అంశాలను గురించి ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు (పేస్ రికగ్నిషన్ సిస్టం-ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్) పై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నెల కంటే ఎక్కువ రోజులు ఎఫ్ ఆర్ఎస్ లో హాజరు నమోదు చేయని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు జారీ చేయాలన్నారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ విధానంలో తప్పనిసరిగా హాజరు నమోదు కావాలన్నారు. విద్యార్థులకు సంబంధించి పేర్లు, ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు చేయడానికి అపార్ ద్వారా పాఠశాలల్లో నమోదు చేపట్టాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో సమగ్ర శిక్ష నుండి జిల్లాలోని 45 పాఠశాలలకు టాయిలెట్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. టాయిలెట్స్ మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలన్నారు. వీబీ జీ రాం జీ పథకం ద్వారా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీలలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడానికి వీలుందని, ప్రాధాన్యత క్రమంలో పాఠశాలలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను గురించి స్థానిక సర్పంచ్ ల దృష్టికి తీసుకెళ్లాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఖాన్ అకాడమీ ద్వారా వచ్చే కార్యక్రమాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకునేవిధంగా తోడ్పాటునందించాలన్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యా ప్రగతి మెరుగుపడే ఇలాంటి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (ఎల్ఐపీ)కు సంబంధించిన వర్క్ బుక్ లను పంపిణీ చేశామన్నారు. తద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్. వి. గిరిరాజ్ గౌడ్, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ మహేష్, ఏఎంవో డాక్టర్ మన్మోహన్, జిసిడివో సునీత, సీఎంఓ సుమాదేవి, అధికారుల తో పాటు ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.








