- ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబరాలు
- సంబరాల్లో చైర్మన్ వి. నరేందర్ రెడ్డి సందడి!
వరంగల్, బ్యూరో మహా;
వరంగల్ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి.
వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో చైర్మన్ వి. నరేందర్ రెడ్డి పాల్గొని బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మ ఆటపాటలతో, గుమ్మడి పూల నడుమ బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. ఈ వేడుకల్లో ఆల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్ రెడ్డి, జోనల్ ఇంచార్జ్ లింగమూర్తి, ప్రిన్సిపాల్ స్వప్న రెడ్డి, మహిళా అధ్యాపకుల తోపాటు విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యం చేసి విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడుతూ, వారిలో ఉత్సాహం నింపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. వరంగల్, హనుమకొండ, వర్ధన్నపేట,
ఆల్ఫోర్స్ క్యాంపస్ లు మొత్తం బతుకమ్మ పూలతో, రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. వందలాది మంది విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలతో ఆటపాటలు సాగించారు.
ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆడపిల్లల్లో మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంచడంతో పాటు, చదువులోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా
పరీక్షల వేళ విద్యార్థినులు బతుకమ్మ వేడుకల్లో వారి ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని ఇదే స్ఫూర్తితో 2027 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించాలని చైర్మన్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








