కారేపల్లి, మహా :కారేపల్లి కి చెందిన యువకుడు అఖీల్ ఖాన్ బీఎస్సీ ఆప్టోమెట్రీ లో గోల్డ్ మెడల్ సాధించారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడకు అనుబంధమైన రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో శనివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే లో ఆప్టోమెట్రిస్ట్ (కంటి విద్యా నిపుణుడు) గా ఉత్తమ ప్రతిభ చూపి ప్రముఖుల చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. చదువులలో చిన్నతనం నుండి చురుకుగా ఉండే మహమ్మద్ అఖిల్ ఉల్లా ఖాన్ జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో ఉచిత సీటు పొంది తన గ్రాడ్యుయేషన్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
*కష్టాలు దాటి కంటి వైద్య నిపుణుడయ్యాడు*
కుమారుడికి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తండ్రి మహమ్మద్ ఖలీల్ ఉల్లా ఖాన్ తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైనాడు. తల్లి రషీద కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయకుంటే ఉండలేని పరిస్థితి. ఇంతటి తీవ్ర ఇబ్బందుల్లోనూ తన తల్లిదండ్రులను కాపాడుకుంటూ, చెల్లెలైన రీషా బాధ్యతలను చూసుకుంటూ, మరోవైపు చదువును విజయవంతంగా పూర్తి చేసిన అఖీల్ ఖాన్ ఈ ఘనత సాధించారు. చదువులలో గోల్డ్ మెడలో సాధించిన అఖీల్ ఖాన్ కంటి వైద్య నిపుణుడిగా మేము సమాజానికి గొప్ప సేవలను అందించాలని తమ కోరికని తల్లిదండ్రులు ఖలిలుల్లా ఖాన్ – రసీదా లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.







