Mahaa Daily Exclusive

  ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా మా పోరాటం.: మల్లికార్జున ఖర్గే..

Share

న్యూఢిల్లీ, మహా.
రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణే ధ్యేయంగా తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నట్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సోమవారం కూడా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలలను కాపాడటంతో పాటు, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రజా సమస్యలు, ఆందోళనలను బాధ్యతాయుతమైన సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ పోరాటంలో భాగంగా సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను కలవనున్నట్లు మల్లికార్జున ఖర్గే అధికారికంగా వెల్లడించారు. ఈ సమావేశంలో దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి తమ ఆందోళనలను సీజేఐకి సవివరంగా వివరిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలు సజావుగా సాగేందుకు రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు.
సోమవారం జరగనున్న ఈ అత్యున్నత భేటీకి సంబంధించి రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.