- లైసెన్స్ లేని వ్యాపారులపై చట్టపరమైన చర్యలు
- జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలీమ్
కారేపల్లి, మహ: లైసెన్స్ లేని వ్యాపారులపై దాడులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాద్రికొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలీమ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇల్లందు మార్కెటింగ్ పరిధిలో సింగరేణి మండలం వస్తుందని సింగరేణి మండల పత్తి, ధాన్యం, మొక్కజొన్న, మిర్చి వంటి పంట ఉత్పత్తులను కొనుగోలుకు తప్పసరిగా వ్యాపారులు లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయదలిచిన వ్యాపారులు,మార్కెట్ కమిటీ నుండి లైసెన్స్ పొందిన తర్వాతనే ఉత్పత్తుల కొనుగోలు, నిల్వలు చేసుకోవాలని తెలిపారు. లైసెన్స్ లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులపై తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మార్కెట్ల చట్టం1966 ప్రకారం శిక్షార్హులన్నారు. లైసెన్స్ కోసం మార్కెట్ కమిటీ కార్యదర్శి సంప్రదించాలని కోరారు.








