Mahaa Daily Exclusive

  రూ.1.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ…

Share

  • రూ.1.20 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
  • రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వైనం

హైదరాబాద్, మహా : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అ ధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న మదన్నపేట సెక్షన్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ పండల సంధ్య రాకేష్‌ రూ.1.20 లక్ష ల లంచం తీసుకుంటూ ఏసీబీ అ ధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ సిటీ రేంజ్‌-II అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారునికి పాత విద్యుత్‌ మీటర్లు పోయిన స్థానంలో ఆరు కొత్త విద్యు త్‌ మీటర్లు మంజూరు చేయడంతో పాటు, వాటికి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆమోదించేందుకు అధికారి రూ.1,20 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా గురువారం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ అధికారిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానం ముందు హాజరు పరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించే ప్రక్రియ చేపట్టారు.