కారేపల్లి,మహ: కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో బి. పద్మ ఆధ్వర్యంలో వేపకాయల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామపంచాయతీలకు చెందిన మహిళా కార్యదర్శులు ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు.







