Mahaa Daily Exclusive

  భూ రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ సుమ

Share

  • రీసర్వే ప్రక్రియ పురోగతి పై అధికారుల ఆరా

వరంగల్, మహా;

వరంగల్ జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం వరంగల్ ఆర్డీఓ సుమ, వరంగల్ తహశీల్దార్ శ్రీకాంత్ లు కొత్తపేట గ్రామాన్ని సందర్శించి అక్కడ చేపడుతున్న భూ రీసర్వే పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామంలో రీసర్వే ప్రక్రియ కొనసాగుతున్న తీరును, ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భూములకు సంబంధించిన వివరాల సేకరణ, భూ సరిహద్దుల గుర్తింపు, రీసర్వేకు సంబంధించిన ఇతర అంశాలను ప్రస్తుత పరిస్థితిని రైతుల నుంచి తెలుసుకున్నారు.

భూ రీసర్వే ద్వారా భూముల వివరాలను స్పష్టంగా నమోదు చేయడంతో పాటు భూ సరిహద్దుల విషయంలో పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. భూ రికార్డుల్లో స్పష్టత తీసుకురావడం, భవిష్యత్తులో భూ సంబంధిత వివాదాలకు అవకాశం లేకుండా చూడటం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమన్నారు.

ఈ రీసర్వే లో ఆర్డీవో వెంట రెవెన్యూ, లాడ్ సర్వే రికార్డ్స్ అధికారులు, సర్వేయర్లు

రైతులు ఉన్నారు.