Mahaa Daily Exclusive

  నిర్ధాక్షిణ్యంగా శిక్షించాల్సిందే… సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు…

Share

 

ఢిల్లీ, మహా : డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరం సాధారణ నేరం కాదని ‘డిజిటల్ దోపిడీ’.. నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించింది. వీడియో కాల్స్ ద్వారా అమాయకులను, వృద్ధులను భయపెట్టే ఈ నేరాలు ‘డిజిటల్ దోపిడీ’ వంటివని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. నేరగాళ్లను అత్యంత నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఒకచోట చేర్చాలన్న నిందితుల పిటిషన్‌ను కొట్టి వేసింది. నిందితుల సౌలభ్యం కోసం బాధితులను ఇబ్బంది పెట్టలేమని, స్వతంత్ర దర్యాప్తు కొనసాగుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.