Mahaa Daily Exclusive

  రేవంత్‌ది ‘బ్రెయిన్ చోరీ’.. రాహుల్ గాంధీది ‘నామ్ చోరీ’.

Share

రేవంత్‌ది ‘బ్రెయిన్ చోరీ’.. రాహుల్ గాంధీది ‘నామ్ చోరీ’.
* దేశాన్ని దోచుకునేందుకు ఇద్దరు దొంగల కుట్ర.
* రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు.
నిర్మల్, మహా.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ‘బీజేపీ మహాపాదయాత్ర’ అశేష జనవాహిని మధ్య అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమై విజయవంతంగా ముగిసింది.
పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్ అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితిని కనీసం పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి వెళ్లి ‘ఓట్ చోరీ’ అంటూ అసత్య ప్రచారాలు, రాజకీయ నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు.. అది ఓట్ చోరీ కాదని, అసలు ఆయన బ్రెయినే చోరీ అయిందని.. అటు గాంధీ పేరును దొంగిలించి రాహుల్ గాంధీ ‘నామ్ చోరీ’కి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు దొంగలు కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా రూ. 12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి అవినీతికి మారుపేరుగా నిలిచిందని రాంచందర్ రావు గారు గుర్తుచేశారు. కానీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా నీతివంతమైన, దేశభక్తితో కూడిన స్వచ్ఛమైన పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. నీతివంతమైన మోదీ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచి కూల్చేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, ఆ కుట్రలను మనమంతా కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలో తిప్పికొడుతూ ఎండగట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి, గ్రామగ్రామానా బీజేపీని మరింత పటిష్టం చేయాలని, భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ , బిజెపి తెలంగాణ రాష్ట్ర సహ ఇన్‌చార్జి రేఖా శర్మ , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి , పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ , జి. నగేష్ , ధర్మపురి అర్వింద్ , ఎమ్మెల్యేలు రామారావు పటేల్ , రాకేష్ రెడ్డి , పాయల్ శంకర్ , పాల్వాయి హరీష్ బాబు , నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ , సహా పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.