- భారతదేశాన్ని ప్రపంచ స్థాయి వైద్య గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జర్మంటెన్ హాస్పిటల్స్ సీఎండీ జవత్ ఖాన భేటీ
న్యూఢిల్లీ, మహా : భారతదేశ వైద్యరంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జర్మంటెన్ హాస్పిటల్స్ కృషి చేస్తోందని ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి భారత వైద్యరంగ అభివృద్ధికి సంబంధించిన తమ విజన్‌ను వివరించినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో జర్మంటెన్ హాస్పిటల్స్‌లో అందిస్తున్న జర్మన్ వైద్య నైపుణ్యం, అంతర్జాతీయ వైద్య సంస్థలతో భాగస్వామ్యాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న చికిత్సా విధానాల గురించి వివరించారు. ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్, స్పైన్ కేర్ విభాగాల్లో భారత్‌ను ప్రపంచ స్థాయి వైద్య కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలపై చర్చించారు.
జర్మన్ సాంకేతికతతో అత్యాధునిక వైద్య సేవలు
జర్మంటెన్ హాస్పిటల్స్ ప్రతిపాదనల్లో భాగంగా జర్మన్ బయోలాజికల్ ఆర్థోపెడిక్స్, వైద్య పరిశోధనలు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్, సహజ కీళ్ల సంరక్షణకు సంబంధించిన వినూత్న చికిత్సలు, ఆధునిక వెన్నెముక చికిత్సలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. రోగుల ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన వారికి తగిన ప్రత్యామ్నాయ చికిత్సలను అందించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అలాగే వివిధ వైద్య విభాగాల్లో ప్రపంచ స్థాయి మల్టీ స్పెషాలిటీ సేవలను విస్తరించడం, జర్మనీకి చెందిన వైద్య నిపుణులతో సహకారం పెంపొందించడం, అంతర్జాతీయ పరిశోధనలు, వైద్య విజ్ఞాన మార్పిడి, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించినట్లు వివరించారు.
అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం
అత్యాధునిక జర్మన్ వైద్య సాంకేతికతను, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చికిత్సలను సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావడమే జర్మంటెన్ హాస్పిటల్స్ ప్రధాన లక్ష్యమని ప్రతినిధి తెలిపారు. వైద్య సేవల నాణ్యతను పెంపొందించడంతో పాటు, చికిత్స ఖర్చులను సాధ్యమైనంత అందుబాటులో ఉంచేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
జర్మంటెన్ హాస్పిటల్స్ ప్రతిపాదించిన వైద్యరంగ అభివృద్ధి ప్రణాళికలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తి కనబరిచినట్లు ప్రతినిధి వెల్లడించారు. జర్మన్ వైద్య నైపుణ్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు.
భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులు నాణ్యమైన, ఆధునిక, అందుబాటు ధరల వైద్య సేవల కోసం ఎంపిక చేసుకునే ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమని జర్మంటెన్ హాస్పిటల్స్ ప్రతినిధి స్పష్టం చేశారు.
“భారత వైద్య సామర్థ్యాలను పెంపొందించడం… ప్రపంచ వైద్య పరిజ్ఞానాన్ని భారత్‌కు తీసుకురావడం… భారత వైద్య సేవలను ప్రపంచానికి పరిచయం చేయడం మా సంకల్పం. ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించే దిశగా భారత్‌ను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.







