Mahaa Daily Exclusive

  పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కూటమి…

Share

  • పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కూటమి
  • టీడీపీ అభ్యర్థి గీతాకుమారి 13,875వేల ఓట్ల మెజార్టీతో గెలుపు
  • మొత్తం 40 వార్డుల్లో టీడీపీ 34, బీజేపీ 2, జనసేన పార్టీ 1, వైసీపీ 3ట

కడప, మహా : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీఅభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి విజయం 13,875వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే పులివెందులలోని 40 వార్డుల్లో టీడీపీకి 34, బీజేపీకి 2, జనసేన 1, వైఎస్సార్‌సీపీ 3 చోట్ల గెలుపొందింది. పులివెందుల మున్సిపాలిటీలో నామినేషన్ల సమయం నుంచి హైడ్రామా నడిచింది. తమ పార్టీ అభ్యర్థుల్ని టీడీపీ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటోందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం 40 వార్డులకు గాను.. కూటమి పార్టీలు దాదాపు 20 వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుంది.

పులివెందుల మున్సిపాలిటీకి మిగిలిన 20 వార్డుల్లో నవంబర్ 1వ తేదీన పోలింగ్ జరిగింది.. ఆ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. వైఎస్ జగన్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పులివెందులకు వచ్చారు.. కూటమి శ్రేణులు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించడం లేదని ఆరోపించారు. ఆర్వో ఆపీస్ ముందు వైఎస్ జగన్‌‌తో పాటుగా ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్లతో కలిసి ధర్నాకు దిగారు. అనంతరం ఆర్వోకే వినతిపత్రం అందించారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జగన్‌తో పాటుగా మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పులివెందులలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వైఎస్సార్‌సీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల, కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) రీపోలింగ్‌ నిర్వహించిన నాలుగు వార్డులు మాత్రమే కాదు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మిగతా అన్ని వార్డుల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని, అప్పటివరకు అక్కడ కౌంటింగ్‌ నిలిపేయాలని కోరారు. కానీ ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.