- కేటీఆర్ కలిసిన ఉద్యమ నేత నీలం రాజు కిషోర్
వరంగల్, మహా;
హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్యమ నేత, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నీలం రాజు కిషోర్ మర్యాదపూర్వకంగా కలిసి
వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ అభ్యర్థించడం జరిగింది. తెలంగాణలో
ప్రస్తుతం బీసీ వాదం బలంగా ఉన్నందున, ముఖ్యంగా పార్టీ ఇప్పటి వరకూ ఈ ఎమ్మెల్సీ టికెట్ బీసీ లకు కేటాయించినందున
పార్టీ లో సీనియర్ గా విద్యార్థి ఉద్యమకారుడిగా,ఓ బీసీ నేతగా నాకు అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేటీఆర్ అధ్యక్షులు కేసీఆర్ దృష్టికి విషయం తీసుకు వెళ్తానని రాజ్ కిషోర్ కు తెలపడం జరిగింది.








