Mahaa Daily Exclusive

  జాగృతి దీపావళి ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన గవర్నర్

Share

  • ‘పర్యావరణమే ప్రాణం – పరిరక్షణ ధర్మం’ ఇతివృత్తంతో ప్రత్యేక ప్రచురణ

 

హైదరాబాద్, మహా : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అధికారిక వారపత్రిక జాగృతి దీపావళి ప్రత్యేక సంచికను గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్ల శనివారం లోక్‌భవన్‌లో ఆవిష్కరించారు. ప్రతి ఏటా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జాగృతి ప్రత్యేక సంచికను ప్రచురిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘పర్యావరణమే ప్రాణం – పరిరక్షణ ధర్మం’ అనే ఇతివృత్తంతో ప్రత్యేక సంచికను వెలువరించింది. భారతీయ జీవన విధానంలో ప్రకృతికి ఉన్న విశిష్టత, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ఈ సంచికను రూపొందించారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఇందులో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ విద్యుత్‌ ప్రముఖ్‌ శ్రీధర్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయ్‌ భాస్కర్‌, జాగృతి సంపాదకుడు కుర్రా దుర్గా రెడ్డి, విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణ ప్రాంత ధర్మాచార్య సంపర్క ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ సికింద్రాబాద్‌ విభాగ్‌ ప్రముఖ్‌ కళ్యాణ్‌, జాగృతి వారపత్రిక నిర్వాహకుడు వనకళ్ళ వీరప్ప తదితరులు పాల్గొన్నారు.