హైదరాబాద్, మహా : తెలంగాణ జైళ్ళ శాఖ లో పనిచేస్తున్న ప్రధాన జైళ్ల పర్యవేక్షణ అధికారులను బదిలీలు చేస్తూ ఆ శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జైల్ పర్యవేక్షణ అధికారిగా పనిచేస్తున్న అశోక్ కుమార్ ను చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం పర్యవేక్షణ అధికారిగా నియామించారు. ఇదే జైల్లో పర్యవేక్షణ అధికారిగా పనిచేస్తున్న భరత్ ను జైళ్ల శాఖ డీజీ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. డీజీ కార్యాలయంలో అటాచ్ మెంట్ లో ఉన్న చింతల దశరథను వరంగల్ సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. ఇదే జైల్లో పనిచేస్తున్న కళాసాగర్ ను నిజామాబాద్ జైలుకు పంపించారు. వెంకటేషంను కరీంనగర్ జిల్లా జైలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.








