Mahaa Daily Exclusive

  డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

Share

  • విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించాలి
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, కలెక్టరేట్ మహా;

జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలకు అవసరమైన మార్గదర్శకత్వం కల్పించాలని అన్నారు.

శనివారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా కాలేజియేట్ విద్యా అభివృద్ధి, సమీక్ష కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యా ప్రగతి, విద్యార్థుల ప్రవేశాలు, పరీక్ష ఫలితాలు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.

విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కోర్సులు నిర్వహించడం, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ, ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లో స్పూర్తి కార్యక్రమాలు నిర్వహించి, క్యాంపస్ ప్లేస్‌మెంట్లను ప్రోత్సహించడం వంటి అంశాలపై సమీక్షించారు.

అలాగే జిగ్నాసా విద్యార్థి పరిశోధన ప్రాజెక్టులు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, ఎన్‌పీటీఈఎల్‌, స్వయం వంటి కార్యక్రమాల్లో విద్యార్థుల భాగస్వామ్యం అవ్వాలని,

కళాశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, బాలికల వసతి గృహాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, భవనాల మరమ్మతుల అవసరాలను సమీక్షించారు.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ కాలేజీ లో పిల్లల హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలని అందుకు ఫేస్ రికగ్నైన్జ్ అటెండెన్స్ అమలు చేయాలను సంబంధిత ప్రిన్సిపల్స్ ను ఆదేశించారు.

 

వరంగల్ సీకేఎం, వర్ధన్నపేట డిగ్రీ కళాశాల, రంగసాయిపేట, నర్సంపేట డిగ్రీ కళాశాలకు ప్రత్యేక అధికారులను కేటాయించి యాజమాన్య నిర్వహణ,కళాశాల పర్యవేక్షణ లో భాగంగా ప్రత్యేక అధికారులను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా కళాశాలల్లో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు తీరును, అక్టోబర్ నెల హాజరు వివరాల పై సమీక్షించారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కళాశాలల వారీగా అవసరమైన చర్యలపై సమీక్షించారు.

 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్ ,జిల్లా కాలేజియేట్ విద్యా అభివృద్ధి కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ మల్లం నవీన్, తో పాటు సభ్యులు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ ,సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.