- ఓటు నమోదుకు మరో అవకాశం
- ఎస్ఐఆర్ గడువు మరోసారి పొడిగింపు
- డిసెంబరు 10తో ముగియాల్సిన ఎస్ఐఆర్ను డిసెంబరు 22 వరకు పొడిగింపు
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును మరోసారి పొడిగించారు. డిసెంబరు 10తో ముగియాల్సిన ఎస్ఐఆర్ డిసెంబరు 22 వరకు పొడిగించారు. ముసాయిదాలో పేరు లేని అర్హుల ఓటు నమోదుకు మరో అవకాశం కల్పిస్తున్నామని సీఈవో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు మార్లు పొడిగించారు. ఆగస్టు 17న ప్రకటించిన ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ మరో అవకాశం ఇచ్చింది.
తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో
ముసాయిదా జాబితా నుంచి ఓటు తొలగించిన వారికి ఈనెల 30 వరకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి డిసెంబరు 10 వరకు వాటిని పరిష్కరిస్తారు. ఆగస్టు 17 నుంచి నోటీసుల ప్రక్రియను ఈనెల 26 వరకు ముగించాల్సి ఉండగా డిసెంబరు 15 వరకు పొడిగించారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, దిల్లీ, నాగాలాండ్, హరియాణా, జార్ఖండ్‌లోనూ ఎస్ఐఆర్ గడువు పొడిగించారు.
2.70 కోట్ల ఓట్లతో తుది జాబితా
మరోవైపు రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. సుమారు 70 లక్షల ఓట్లు తగ్గి దాదాపు 2.70 కోట్ల ఓట్లతో తుది జాబితా సిద్ధమైంది. అనర్హులుగా ప్రకటించన ఓటర్లలో ఎక్కువగా మరో చోట ఓటు ఉన్న వారేనని అధికారులు తెలిపారు. అర్హులైన ఓటర్లు గతంలో ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వలేకపోతే ఇప్పటికైనా సమర్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మరింత సమాచారం, సహాయం కోసం స్థానిక బీఎల్ఓను లేదా 1950 టోల్ఫ్రీనంబరును సంప్రదించాలని సీఈవో చెప్పారు. డిసెంబరు 22 వరకు నోటీసులు, అభ్యంతరాలు, కొత్త దరఖాస్తుల క్లియర్‌కు గడువు ఉందన్నారు. తుది జాబితా ప్రకటించిన తర్వాత కూడా అర్హులైన ఓటర్లు తమ పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని సీఈవో కార్యాలయం తెలిపింది.








