- కుల్గాంలో ఎన్ కౌంటర్
- ఇద్దరు ఉగ్రవాదులు హతం!
- మృతుల్లో లష్కరే కమాండర్ లతీఫ్ భట్
- ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు
జమ్మూకశ్మీర్, మహా : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ క్రమంలో కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఆ సంస్థకు చెందిన కమాండర్ లతీఫ్ భట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడినట్లు వెల్లడించారు.
గత వారం సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడి…
హతమైన ఉగ్రవాదులు గత వారం సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు వారి కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కుల్గామ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎన్‌కౌంటర్ అనంతరం సంబంధిత ప్రాంతంలో భద్రతా బలగాలు సోదాలు ముమ్మరం చేశాయి. మరికొందరు ఉగ్రవాదులు ఎక్కడైనా దాక్కున్నారా? అనే కోణంలో తనిఖీలు చేపట్టాయి. గాయపడిన ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్ల వివరాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రాంతంలో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి.






