Mahaa Daily Exclusive

  చంచల్‌ గూడ జైలును తనిఖీ చేసిన స్వాతి లక్రా…

Share

  • చంచల్‌ గూడ జైలును తనిఖీ చేసిన స్వాతి లక్రా
  • ఖైదీల సంక్షేమం, వసతులపై సమీక్ష
  • జైలు నిర్వహణపై అధికారులకు సూచనలు

హైదరాబాద్‌, మహా : తెలంగాణ జైళ్ల శాఖ డీజీ స్వాతి లక్రా చంచల్‌గూడ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జైలు నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. జైలులోని కీలక విభాగాలు, మౌలిక సదుపాయాలను తనిఖీ చేసి వాటి పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఖైదీల సంక్షేమం, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జైలు సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై సమాచారం సేకరించారు. జైళ్లలో సంస్కరణలు అమలు చేయడంతోపాటు ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ స్వాతి లక్రా తో పాటు జైళ్ల శాఖ ఐజి లు ఎర్రంశెట్టి రాజేష్. మురళి బాబు. హైదరాబాద్ రేంజ్ డిఐజి సంపత్. చంచల్గూడా జైలు పర్యవేక్షణ అధికారి నవాబు శివకుమార్ గౌడ్. జైలు సిబ్బంది ఉన్నారు. స్వాతి లక్రా జీవిత ఖైదీల పరివర్తనకు సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించారు. జైలు ను అంతా తిరిగి పరిశీలించారు.