*ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
*బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
*ఈస్ట్ జోన్ డిసీపీ అంకిత్ కుమార్
మామునూర్, మహా ;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డిసీపీ అంకిత్ కుమార్, ఐపీఎస్ సోమవారం మామునూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు డిసీపీకి పూల మొక్క అందించి స్వాగతం పలకగా, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
వార్షిక తనిఖీలో భాగంగా మామునూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలను డిసీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, బాధ్యతలు, పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డిసీపీ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపిఎస్ సూచనలను పాటిస్తూ విదులు నిర్వహించాలని అధికారులను, సిబ్బందికి ఆదేశించారు.
ముఖ్యంగా యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి వినియోగం, విక్రయాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని మామునూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మామునూర్ ఏసీపీ వెంకటేష్ , మామునూర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ.లు నిసార్ పాషా, హరిశంకర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








