రాజేంద్రనగర్ మహా ;
పాడి పశువులలో మేలుజాతి సంతతిని వేగంగా అభివృద్ధి చేసేందుకు పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ లో
పిండ మార్పిడి కార్యక్రమాన్ని
విజయవంతంగా నిర్వహించారు.
పాలమూరు బయోసైన్సెస్ సహకారంతో ఆడ దూడలు పుట్టే అవకాశాలను పెంచే ‘లింగ-విభజిత వీర్యాన్ని’ ఉపయోగించి ప్రయోగశాలలో హోల్ స్టీన్ ఫ్రీసియన్ ఎక్స్ సాహివాల్ సంకర పిండాలను ఉత్పత్తి చేశారు. నాణ్యమైన 13 పిండాలను విశ్వవిద్యాలయ పశుక్షేత్రంలోని సాహివాల్, దేవని, ఒంగోలు జాతి ఆవులకు బదిలీ చేశారు.
ఈ సాంకేతికత ద్వారా తక్కువ కాలంలోనే మేలుజాతి దాత ఆవుల నుంచి అధిక సంఖ్యలో ఆడ దూడలను పొందవచ్చని, పాల దిగుబడిని గణనీయంగా పెంచవచ్చని నిపుణులు తెలిపారు.








