- ఏడుపాయలలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలంకరణ సేవ
- శివలింగం, గణపతి ఆకృతుల్లో దీపాలంకరణ
- కనువిందు చేసిన ఆకాశదీపం కార్యక్రమం
మెదక్, మహా : పవిత్ర కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో ప్రత్యేక దీపాలంకరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం శివలింగం, గణపతి ఆకృతులను ఏర్పాటు చేసి వాటి చుట్టూ వేలాది దీపాలతో దీపాలంకరణ సేవ చేపట్టారు. అదేవిధంగా ఆకాశదీపం కార్యక్రమాన్ని భక్తిపారవశ్యంతో నిర్వహించారు.
దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీకమాస ప్రాముఖ్యతను చాటిచెప్పేలా నిర్వహించిన ఈ ప్రత్యేక దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందారు.








