- అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్
- న్యూ ఇయర్ గిఫ్ట్
హైదరాబాద్, మహా
మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ ఉంటాయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధం అవుతోంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కం చెప్పేందుకు డిసెంబర్ 31న మందుబాబులు మందేసి చిందేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో సైతం పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న రాష్ట్రంలోని వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్రంలోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు న్యూ ఇయర్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో నడిచే ఈవెంట్లకు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు కాంగ్రెస్ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.








