Mahaa Daily Exclusive

  సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట…!

Share

సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్‌బాబు (Manchu Mohanbabu)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ (Bail) పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసుపై ముందస్తు బెయిల్ (Anticipatory bail) మంజూరుకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నిరాకరించింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం జస్టిస్ సుధాంశు థులియా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆయనను అరెస్టు చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Latest