మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా తిరుమలాయపాలెం దగ్గర కారు ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా కారు రెండు టైర్లు పేలాయి. దీంతో ఆ కారు అదుపుతప్పింది. వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును రోడ్డు పక్కన నిలిపాడు. ప్రమాద సమయంలో కారులో మంత్రి పొంగులేటితో పాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ చైర్మన్లు బొర్రా రాజశేఖర్, తళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. సిబ్బంది వెంటనే ఆయనను అక్కడి నుంచి ఎస్కార్ట్ కారులో ఖమ్మం క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
Post Views: 52








