Mahaa Daily Exclusive

  మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాధం మృతిపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంతాపం ….!

Share

మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాధం మృతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలియజేశారు.. నాగర్ కర్నూల్ లోకసభ సభ్యునిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారునిగా మందా జగన్నాధం పాత్ర తెలంగాణ రాష్ట్రంలో మరుపురానిదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జగన్నాధం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. అయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతి తెలియజేశారు