విశాఖ నుండి తూర్పుగోదావరి జిల్లా కు వెళ్లిన కొత్త అల్లుడి కి
250 రకాల వంటకాలతో ఆతిధ్యం ఇచ్చి
గోదవారోళ్ళ మజాకా అనిపించుకున్నారు.
ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి పదుల సంఖ్యలో వంటకాలతో విందు పెట్టడంలో గోదావరి వాసులు తరువాతే ఎవ్వరైనా అని చెప్పాలి.సంక్రాంతి కి వచ్చిన విశాఖ కు చెందిన వైసిపి రాష్ట అధికార ప్రతినిధి యూత్ నాయకుకుడు కొండా రాజీవ్ కు కొత్త అల్లుడి హోదాలో కాకినాడ కు చెందిన అత్త మామలు వందలాది వంటకాలు వడ్డీంచటం చర్చనీయాంశం గా మారింది
అత్తగారింట్లో కొండా రాజీవ్ గాంధీ కి భారీ విందు ఏర్పాటు చేసారు.250 రకాలతో సంక్రాంతి కొత్త అల్లుడికి అతిధ్యం ఇచ్చిన గోదావరి అత్తమామలు అందరిని అబ్బుర పరిచారు. కాకినాడ నగరం గాంధీనగర్ లో ఈ వేడుకులకు వేదిక అయింది.విశాఖ అల్లుడు రాజీవ్ ఆ ఆనందాన్ని మహా పత్రిక తో పంచుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లో ఒక ఇంటికి అల్లుడు కావడం సంక్రాంతి కి వెళ్లడం సంతోషకర విషయమన్నారు. సంక్రాంతి కి వారు చేసే మర్యాదలు ,ఆతిధ్యం మరువలేనివి అని గుర్తుచేసుకున్నారు.








