Mahaa Daily Exclusive

  అశోక్ లేలండ్ ను డీ కొట్టిన కారు…!

Share

మేడారం వనదేవతలను దర్శించుకుని తిరిగి వస్తున్న అశోక్ లేలండ్ వాహనాన్ని కారు వెనుక నుండి ఢీ కొట్టిన సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం రాత్రి జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం పోలపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మేడారం సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో లింగాపూర్ క్రాస్ వద్ద పస్రా నుండి వేగంగా వస్తున్న కారు లారీని తప్పించబోయి ఢీకొట్టింది. అశోక్ లేలండ్ పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కనున్న గుంతలో పడిపోగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటాపూర్ ఎస్సై సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని చేరుకుని వారిని అంబులెన్స్ లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ములుగు ఏరియా హాస్పిటల్ లో పరీక్షించిన డాక్టర్లు ఆరుగుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటాపూర్ ఎస్సై సతీష్ తెలిపారు.